Anantnag Encounter | అనంత్‌నాగ్‌లో 50 గంటలుగా కొనసాగుతున్న యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్
Anantnag Encounter | జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)లోని అనంత్‌నాగ్ (Anantnag) జిల్లాలో భద్రతా దళాల యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ సుమారు 50 గంటలుగా కొనసాగుతోంది. కోకెర్నాగ్ (Kokernag) ఏరియాలోని దట్టమైన అడవుల్లో ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు, పోలీసులు సంయుక్తంగా వేట కొనసాగిస్తున్నారు.
Anantnag Encounter | జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)లోని అనంత్‌నాగ్ (Anantnag) జిల్లాలో భద్రతా దళాల యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ సుమారు 50 గంటలుగా కొనసాగుతోంది. కోకెర్నాగ్ (Kokernag) ఏరియాలోని దట్టమైన అడవుల్లో ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు, పోలీసులు సంయుక్తంగా వేట కొనసాగిస్తున్నారు.
కోకెర్నాగ్లో ఉగ్రవాదులు నక్కిఉన్నట్లు భద్రతా దళాలకు సమాచారం వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన భద్రతా దళాలు జమ్మూ కశ్మీర్ పోలీసులతో కలిసి బుధవారం నుంచి సంయుక్తంగా ఆపరేషన్ (Joint-Operation) చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకూ నలుగురు అధికారులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఎన్కౌంటర్లో ఓ ఆఫీసర్ కనిపించకుండా పోయారు. ఆయన ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు.
లష్కరే తోయిబాకు ప్రత్యామ్నాయం అయిన ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రవాద దళం ఈ కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది. కోకెర్నాగ్ ప్రాంతంలో సుమారు ముగ్గురు ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు భద్రతా దళాలు అనుమానిస్తున్నారు. వారిని పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గారోల్ గ్రామంలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ ద్వారా ఉగ్రవాదుల కోసం గాలింపు చేపడుతున్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో హీరన్ డ్రోన్లతో పాటు క్వాడ్కాప్టర్లను .. నిఘా కోసం రంగంలోకి దింపారు.
Also Read..
Manipur Violence | 175 మంది మృతి.. మార్చురీలో 96 మృతదేహాలు.. మణిపూర్ హింసపై పోలీసు డేటా
Nuh violence | నుహ్ అల్లర్ల కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్
The Resistance Front: ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అంటే ఏమిటీ.. అనంత్‌నాగ్ ఎన్‌కౌంటర్‌తో లింకేటి ?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

