కర్ణాటకలో రికార్డుస్థాయిలో 48,296 కరోనా కేసులు.. 217 మరణాలు

బెంగళూరు: దేశంలో మరో కరోనా కేంద్రంగా కర్ణాటక మారుతున్నది. ఆ రాష్ట్రంలో మహమ్మారి వ్యాప్తి తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్నది. గురువారం నుంచి శుక్రవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా రికార్డు స్థాయిలో 48,296 కరోనా కేసులు, 217 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 15,23,142కు, మొత్తం మరణాల సంఖ్య 15,523కు పెరిగింది.
మరోవైపు కర్ణాటకలో గత 24 గంటల్లో 14,884 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 11,24,909కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం 3,82,690 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

