Karnataka Alert | బొమ్మై సర్కార్ అలర్ట్.. విదేశీయులకు స్క్రీనింగ్ !
Karnataka Alert | ఇద్దరు దక్షిణాఫ్రికా ఇద్దరు ప్రయాణికులకు కరోనా అని తేలడంతో విదేశీయులకు కర్ణాటక స్క్రీనింగ్ తప్పనిసరి చేసింది.

Karnataka Alert | దక్షిణాఫ్రికాలో బయటపడ్డ కరోనా న్యూ వేరియంట్ ఒమిక్రాన్‌పై ఆందోళన నేపథ్యంలో కర్ణాటక సర్కార్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నది. వివిధ దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో స్క్రీనింగ్ టెస్ట్‌లు తప్పనిసరి చేసింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నది. విదేశీ ప్రయాణికులకు వారం తప్పనిసరి క్వారంటైన్ నిబంధనలు అమలులోకి తెచ్చింది. ఈ మేరకు శనివారం సీఎం బస్వరాజ్ బొమ్మై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
దక్షిణాఫ్రికాతోపాటు బోట్స్వానా, హాంకాంగ్, ఇజ్రాయెల్ తదితర దేశాల నుంచి వచ్చిన వారి వద్ద కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ ఉన్నా మళ్లీ పరీక్షలు చేయించుకోవాలని పేర్కొంది. క్వారంటైన్ సమయం ముగిసిన తర్వాత మళ్లీ నెగెటివ్ వచ్చిన తర్వాత బయటకు వెళ్లాలని స్పష్టం చేసింది.
ఇక ధార్వాడ్ ఎస్డీఎం మెడికల్ కళాశాలలో 281 మంది కోవిడ్ బారీన పడటంతో పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే సందర్శకులపైన ఆంక్షలు విధించింది. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచి వచ్చే వారు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకోవాలని ఆదేశించింది.
మరోవైపు ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, మాల్స్, హోటల్స్, సినిమా హాళ్లు, జూ, స్విమ్మింగ్‌పూల్స్ తదితర చోట్ల ప్రవేశాలకు రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరి చేసింది. స్కూళ్లు, కళాశాలల్లో తాత్కాలికంగా సాంస్కృతిక వేడుకలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- basvaraj bommai
- omicron
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

