Mechanic | బెంగళూరు, అక్టోబర్ 10: కర్ణాటకకు చెందిన ఒక మెకానిక్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. మాండ్య జిల్లాకు చెందిన అల్తాఫ్ కేరళ లాటరీలో రూ.25 కోట్లను గెల్చుకున్నాడు. కేరళకు చెందిన తిరువోణం బంపర్ లాటరీ ప్రతి ఏడాది పెద్ద మొత్తంలో ప్రైజ్ మనీ ఇస్తుంది.
గత 15 ఏండ్లుగా తాను లాటరీ టికెట్లు కొంటున్నానని, ఇన్నాళ్లకు తనను అదృష్టం వరించిందిని అల్తాఫ్ తెలిపాడు. ప్రైజ్ మనీ తీసుకోవడానికి వచ్చిన ఆయన మాట్లాడుతూ వయనాడ్‌లో ఉన్న తన చిన్ననాటి స్నేహితుడిని చూసేందుకు అప్పుడప్పుడు వెళ్తుంటానని, వెళ్లినప్పుడల్లా లాటరీ టికెట్‌ను కొనేవాడినని చెప్పాడు. వివిధ పన్నులన్నీ పోను లాటరీ విజేతకు సుమారు రూ.13 కోట్లు వస్తాయని నిర్వాహకులు తెలిపారు.