బెంగళూరు: కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిని మారుస్తారనే వార్త వినిపిస్తున్నదని హోంమంత్రి పరమేశ్వర పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్లారని, అక్కడ సీడబ్ల్యూసీ సమావేశం తర్వాత రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై చర్చలు జరగొచ్చని ఆయన పేర్కొన్నారు.
క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణతో పాటు పీసీసీ అధ్యక్షుడిని మారుస్తారనే ప్రచారం వినిపిస్తున్నదని ఆయన తెలిపారు. కాగా, నాలుగేండ్లుగా పీసీసీ అధ్యక్షుడిగా డీకే కొనసాగుతున్నారు.