SM Krishna | కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కన్నుమూత
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం కృష్ణ (SM Krishna) కన్నుమూశారు. గతకొంత కాలంగా వృద్ధాప్యం రీత్యా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం తెల్లవారుజామున బెంగళూరులోని సదాశివనగర్‌లో తుదిశ్వాస విడిచారు.
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం కృష్ణ (SM Krishna) కన్నుమూశారు. గతకొంత కాలంగా వృద్ధాప్యం రీత్యా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం తెల్లవారుజామున బెంగళూరు సదాశివనగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ ఏడాది 29న ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్లో దవాఖానలో చేరారు. నాలుగు నెలలపాటు చికిత్స అనంతరం కోలుకున్న ఆయన ఆగస్టు 28న డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఆయనను ఆ తర్వాత కూడా అనారోగ్య సమస్యలు వెంటాడటంతో మంగళవారం తెల్లవారుజామను కన్నుమూశారు.
పాత మైసూరు ప్రాంతంలోని మద్దూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఎస్ఎం కృష్ణ.. 1999 నుంచి 2004 వరకు కర్ణాటక 16వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. తర్వాత 2004 నుంచి 2008 వరకు మహారాష్ట్ర గవర్నర్‌గా, కేంద్ర విదేశాంగ మంత్రిగా పనిచేశారు. 1971 నుంచి 2014 వరకు వివిధ సమయాల్లో లోక్‌సభ, రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. 1989 డిసెంబర్ నుంచి జనవరి 1993 వరకు అసెంబ్లీ స్పీకర్‌గా కూడా వ్యవహరించారు. చాలా కాలంపాటు కాంగ్రెస్‌లో కొనసాగిన ఎస్ఎం కృష్ణ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 2017 మార్చిలో బీజేపీలో చేరారు. ఆయన చివరిసారిగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతరఫున ప్రచారం చేశారు. ఆ తర్వాత ఎస్ఎం కృష్ణ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు.
మైసూర్‌లోని మహారాజా కళాశాలలో పట్టభద్రుడయ్యారు. అనంతరం బెంగళూరులోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో లా చేశారు. తరువాత, అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని సదరన్ మెథడిస్ట్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యనభ్యసించారు. వాషింగ్టన్‌లోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఫుల్బ్రైట్ స్కాలర్షిప్ను అందుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

