DSP | బెంగళూరు: భూవివాదంలో ఫిర్యా దు చేయడానికి వచ్చిన మహిళపై కర్ణాటకలో ఓ డీఎస్పీ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. డీఎస్పీ కార్యాలయంలోనే జరిగిన ఈ దారుణానికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. తుమకూరు జిల్లా పావగడకు చెందిన ఓ మహిళ భూవివాదంపై ఫిర్యాదు చేయడానికి మధుగిరి డీఎస్పీ కార్యాలయానికి వెళ్లారు.
ఆమెపై కార్యాలయ రెస్ట్రూమ్లోనే డీఎస్పీ రామచంద్రప్ప లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తుమకూరు కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర సొంత జిల్లా కావడం మరింత విమర్శలకు తావిచ్చింది. ఈ ఘటన తర్వాత డీఎస్పీ పరారీలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ ఘటనపై పోలీసు శాఖ ఇంకా స్పందించలేదు.