బెంగళూరు: ఒక ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. మహిళకు సిజేరియన్ డెలివరీ చేసిన వైద్యులు ఆమె కడుపులో బ్యాండేజ్ వదిలేశారు. (bandage inside woman’s abdomen) దీంతో ఆమె అనారోగ్యంతో బాధపడింది. ఈ నేపథ్యంలో స్కానింగ్ చేయగా ఈ విషయం బయటపడింది. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గత ఏడాది నవంబర్ 24న ఒక గర్భిణీ కాన్పు కోసం పుత్తూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. డాక్టర్ అనిల్ నేతృత్వంలోని ముగ్గురు వైద్యుల బృందం ఆమెకు సిజేరియన్ ఆపరేషన్ ద్వారా డెలివరీ చేశారు.
కాగా, గత ఏడాది డిసెంబర్ 2న హాస్పిటల్ నుంచి ఆ మహిళ డిశ్చార్జ్ అయ్యింది. ఇంటికి వచ్చిన కొన్ని రోజుల్లోనే నిరంతరం కడుపు నొప్పి, జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలతో ఆమె బాధపడింది. ఆరోగ్యం క్షీణిస్తుండటంతో ఆ మహిళ భర్త ఆందోళన చెందాడు. సర్జరీ చేసిన వైద్యులను సంప్రదించాడు. దీంతో డిసెంబర్ 19న ఆ మహిళ కడుపు స్కానింగ్ చేయగా సర్జరీ తర్వాత డాక్టర్లు లోపల బ్యాండేజ్ వదిలేసినట్లు బయటపడింది.
మరోవైపు డాక్టర్ల పొరపాటును గ్రహించిన భర్త ఆమెను మరో హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. అక్కడి డాక్టర్లు సర్జరీ ద్వారా కడుపులో ఉన్న బ్యాండేజ్‌ను తొలగించారు. డిశ్చార్జ్ అయిన తన భార్య కోలుకుంటున్నట్లు భర్త గగన్‌దీప్ తెలిపాడు. ఫిబ్రవరి 22న ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. డాక్టర్ల నిర్లక్ష్యాన్ని ఎండగట్టాడు. తల్లీ బిడ్డ చాలా ఇబ్బంది పడినట్లు వాపోయాడు. వారు ఏం తప్పుచేశారని అతడు ప్రశ్నించారు. తన భార్య ప్రాణాలకు ముప్పు కలిగించిన సంబంధిత డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. తమకు న్యాయం చేయాలని అందులో కోరాడు. అయితే ఆ ఆసుపత్రి లేదా ఆ డాక్టర్లపై పోలీసులకు అతడు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.
@IMAIndiaOrg #JusticeForSharanya
I want to lodge a complaint against Dr Anil S Puttur city hospital for leaving surgical mop inside her abdomen while doing C- Section. Mother & infant suffered heavily without mother’s milk , her life was in danger & still under treatment.— Gagandeep.B (@deepubangaradka) February 22, 2025