DK Shivakumar: రోడ్ షోలో రూ.500 నోట్లను విసిరేసిన కర్నాటక కాంగ్రెస్ చీఫ్
DK Shivakumar: 500 నోట్లను రోడ్‌షోలో విసిరేశారు డీకే శివకుమార్. కర్నాటక ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న రోడ్‌షోలో ఈ ఘటన జరిగింది. ఆయన ఆ రాష్ట్ర సీఎం అభ్యర్థిగా .. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఇవాళ ఆ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్‌కానున్నది.
బెంగుళూరు: కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్(DK Shivakumar).. మంగళవారం జరిగిన రోడ్ షోలో.. జనంపై రూ.500 కరెన్సీ నోట్ల(currency notes)ను విసిరేశారు. మాండ్యా జిల్లాలోని బెవినహల్లిలో ప్రచారం జరుగుతున్న సమయంలో.. ఆయన తన బస్సు రూఫ్‌టాప్(bus rooftop) నుంచి కరెన్సీ నోట్లను వెదజల్లారు. అసెంబ్లీ ఎ న్నికల నేపథ్యంలో సీఎం అభ్యర్థి శివకుమార్ ప్రజా ధ్వని యాత్రను నిర్వహిస్తున్నారు. మాండ్యా ప్రాంతంలో శక్తివంతమైన వొక్కలింగ్ వర్గం(vokkalinga community) ఓట్లను తనవైపు మళ్లించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు.
#WATCH | Karnataka Congress Chief DK Shivakumar was seen throwing Rs 500 currency notes on the artists near Bevinahalli in Mandya district during the ‘Praja Dhwani Yatra’ organized by Congress in Srirangapatna. (28.03) pic.twitter.com/aF2Lf0pksi
— ANI (@ANI) March 29, 2023
నిజానికి మాండ్యా(Mandya)లో వక్కలింగ కమ్యూనిటీదే ఆధిక్యం ఉంటుంది. 2018 ఎన్నికల్లో అక్కడ జేడీఎస్ ఏడు సీట్లను గెలుచుకున్నది. 224 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఇప్పటికే తొలి జాబితాలో 124 మందికి సీట్లను ప్రకటించింది. ప్రస్తుత అసెంబ్లీలో బీజేపీకి 121 సీట్లు ఉన్నాయి. మిగిలినవాటికలో కాంగ్రెష్ 70, జేడీస్కు 30 సీట్లు ఉన్నాయి. 2018లో కాంగ్రెస్, జేడీఎస్‌లు సంయుక్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 2019లో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు భారీ సంఖ్యలో రాజీనామా చేయడంతో అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Zimbabwe Cricket | టీమిండియాతో చరిత్రాత్మక సిరీస్.. జింబాబ్వే స్క్వాడ్ ప్రకటన..!
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

