బెంగళూరు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (Siddaramiah) వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. పహల్గామ్ ఉగ్రదాడిపై ఆయన మాట్లాడారు. పాకిస్థాన్‌పై యుద్ధం చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ‘కఠినమైన భద్రతా చర్యలు చేపట్టాలి. మేం యుద్ధానికి అనుకూలం కాదు. శాంతి ఉండాలి. ప్రజలు సురక్షితంగా ఉండాలి. కేంద్ర ప్రభుత్వం సమర్థవంతమైన భద్రతా ఏర్పాట్లు చేయాలి’ అని అన్నారు.
కాగా, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలను జియో న్యూస్‌తో సహా పాకిస్థాన్ మీడియా కవర్ చేశాయి. ‘భారతదేశంలో యుద్ధానికి వ్యతిరేకంగా స్వరాలు’ అన్న హెడ్డింగ్‌తో వార్తలు ప్రసారం చేశాయి. దీంతో సిద్ధరామయ్యపై విమర్శలు వెల్లువెత్తాయి. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర ఆయనపై మండిపడ్డారు. ‘సిద్దరామయ్యకు సరిహద్దుల నుంచి పెద్ద చీర్స్! పాకిస్థానీ మీడియా సిద్దరామయ్యను ప్రశంసించింది’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. పాక్ మీడియా వీడియో క్లిప్‌ను షేర్ చేశారు.
మరోవైపు తన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపడంతో సీఎం సిద్ధరామయ్య స్పందించారు. యుద్ధానికి వెళ్లకూడదని తాను ఎప్పుడూ చెప్పలేదన్నారు. ‘పాకిస్థాన్‌తో మనం యుద్ధం చేయకూడదని నేను ఎప్పుడూ చెప్పలేదు. యుద్ధం పరిష్కారం కాదని మాత్రమే నేను చెప్పా. పర్యాటకులకు రక్షణ కల్పించాలి. ఇది ఎవరి బాధ్యత? ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉంది. భారత ప్రభుత్వం తగినంత భద్రత కల్పించలేదు. యుద్ధానికి సంబంధించినంత వరకు, అది అనివార్యమైతే, మనం యుద్ధానికి దిగాలి’ అని అన్నారు.
Big Cheers for Wazar-e-Ala @siddaramaiah from far across the Borders! Pakistani media is all too praise for @siddaramaiah & visibly disappointed at the backslash he is receiving from BJP & others, for his comments against war with Pakistan!
Nehru was taken around in an open Jeep… pic.twitter.com/lYBxCdiCqU
— Vijayendra Yediyurappa (@BYVijayendra) April 27, 2025