Karnataka CM Siddaramaiah | కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య సంచలన వ్యాఖ్యలు.. 50 మంది ఎమ్మెల్యేలకు బీజేపీ రూ.50 కోట్ల ఆఫర్ చేసిందని ఆరోపణ..
Karnataka CM Siddaramaiah | తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ పని చేస్తుందని కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య ఆరోపించారు. ఇందు కోసం 50 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఇవ్వజూపిందన్నారు.
Karnataka CM Siddaramaiah | తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ పని చేస్తుందని కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య ఆరోపించారు. ఇందు కోసం 50 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఇవ్వజూపిందన్నారు. మైసూర్ జిల్లాలో ఆయన పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. తర్వాత జరిగిన బహిరంగ సభలో సిద్ధరామయ్య మాట్లాడుతూ బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ‘సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని ఎలాగైనా కూలగొట్టేందుకు 50 మంది ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లు చొప్పున వారు ఆఫర్ చేశారు. అంత డబ్బు వారికెక్కడి నుంచి వచ్చింది. మాజీ సీఎంలు బీఎస్ యెడియూరప్ప, బస్వరాజ్ బొమ్మై, ప్రతిపక్ష నేత ఆర్ అశోక్, బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు బీవై విజయేంద్ర ఆ సొమ్ము చెల్లిస్తున్నారా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతల ఆఫర్‌ను తమ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంగీకరించలేదన్నారు. దీంతో తమపై కేసులు పెట్టే పనిలో బీజేపీ ఉందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

