బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి యెడియూరప్ప కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రి నుంచి యెడియూరప్ప డిశ్చార్జి అయ్యారు. ఈ సందర్భంగా యెడియూరప్ప మీడియాతో మాట్లాడుతూ.. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత తాను ఆరోగ్యంగా ఉన్నానని వెల్లడించారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు కేబినెట్ మీటింగ్ నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో కరోనా పరిస్థితులపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
ఈ నెల 16న యెడియూరప్ప రెండోసారి కరోనా బారిన పడ్డ విషయం విదితమే. గతేడాది ఆగస్టులో మొదటిసారి కర్ణాటక సీఎం కరోనాకు గురయ్యారు. అప్పుడు యెడియూరప్పతో పాటు ఆయన కుమార్తె పద్మావతికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది.
Karnataka CM BS Yediyurappa discharged from Manipal Hospital, Bengaluru
— ANI (@ANI) April 22, 2021
"I am healthy now after the treatment. I have called cabinet meeting today at 4pm today," he says. pic.twitter.com/sGYZb1Fn3M