Yediyurappa | సొంత పార్టీపై బీజేపీ ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు.. హైకమాండ్ తీరుపై ఆగ్రహం
కర్నాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప (Yediyurappa) కుమారుడు బీవై విజయేంద్రను రాష్ట్ర బీజేపీ చీఫ్గా నియమించడం పట్ల ఆ పార్టీ ఎంపీ రమేష్ జగజినగి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
బెంగళూర్ : కర్నాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప (Yediyurappa) కుమారుడు బీవై విజయేంద్రను రాష్ట్ర బీజేపీ చీఫ్గా నియమించడం పట్ల ఆ పార్టీ ఎంపీ రమేష్ జగజినగి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్టీ చీఫ్గా విజయేంద్ర నియామకం పట్ల హైకమాండ్ తీరును ఆయన తప్పుపట్టారు. రాష్ట్రంలో పార్టీ నేతలను పక్కనపెట్టి విజయేంద్రకు కీలక పదవి కట్టబెట్టడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
విజయపురలో రమేష్ విలేకరులతో మాట్లాడుతూ బీజేపీలో దళితులు ఎదగలేరని అన్నారు. మీరు దళితులైతే బీజేపీలో ఎదిగేందుకు మీకు ఎలాంటి అవకాశాలు రావని వ్యాఖ్యానించారు. డబ్బున్న ఇతర నేతలు లేదా గౌడల (వొక్కలిగలు)కు పార్టీలో ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. దళితులకు మాత్రం ఎవరూ మద్దతుగా నిలవరని ఈ విషయం తమకు తెలుసని, పార్టీలో ఈ పరిస్ధితి విచారకరమని ఆందోళన వ్యక్తం చేశారు.
యడియూరప్ప కుమారుడు అయినందునే విజయేంద్రను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారని ఆరోపించారు. కాగా, నళిన్ కుమార్ కతీల్ స్ధానంలో కర్నాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కుమారుడు, షికారిపుర ఎమ్మెల్యే బీవై విజయేంద్ర ఈనెల 15న కర్నాటక బీజేపీ చీఫ్ బాధ్యతలను అధికారికంగా స్వీకరించనున్నారు.
Read More :
Delhi Pollution: ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం.. క్షీణించిన వాయు నాణ్యత
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

