Kanwar Yatra | కన్వర్ యాత్రలో విషాదం.. విద్యుధాఘాతంతో ఐదుగురు యాత్రికులు మృతి
న్వర్ యాత్రలో (Kanwar Yatra) తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. హరిద్వార్‌లో (Haridwar) పవిత్ర జలాలను (Holy water) తీసుకొని వెళ్తున్న కన్వరియాల (Kanwariyas) వాహనం ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) మీరట్‌లో (Meerut) విద్యుధాఘతానికి (Electrocuted) గురైంది.
లక్నో: కన్వర్ యాత్రలో (Kanwar Yatra) తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. హరిద్వార్‌లో (Haridwar) పవిత్ర జలాలను (Holy water) తీసుకొని వెళ్తున్న కన్వరియాల (Kanwariyas) వాహనం ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) మీరట్‌లో (Meerut) విద్యుధాఘతానికి (Electrocuted) గురైంది. దీంతో ఐదుగురు కన్వరీలు మృతిచెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. హరిద్వార్‌లో పవిత్ర గంగా జలం తీసుకుని సొంతూర్లకు వెళ్తున్న కన్వరీల వాహనం శనివారం రాత్రి 8 గంటలకు యూపీలోని మీరట్ చేరుకున్నది.
ఈ క్రమంలో వాహనంలోని స్పీకర్.. విద్యుత్ హై టెన్షన్ వైరుకు (High-tension wire) తగిలింది. దీంతో వాహనం మొత్తం కరెంట్ షాక్ రావడంతో అందులో ఉన్న 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని హుటాహుటిన దవాఖానకు తరలించారు. అయితే వారిలో ఐదుగురు మరణించగా, మిగిలినవారు చికిత్స పొందుతున్నారని అధికారులు వెల్లడించారు. కన్వరీల మృతిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే వారు చనిపోయారని నిరసనకు దిగారు. దీంతో గ్రామంలో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అదనపు బలగాలను మోహరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

