బెంగళూరు, మార్చి 4: కన్నడ నటి రాన్యా రావును బెంగళూరు విమానాశ్రయంలో రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు సోమవారం అదుపులోకి తీసుకొన్నారు. ఆమె నుంచి 14.8 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. గత 15 రోజుల్లో ఆమె నాలుగుసార్లు దుబాయ్ వెళ్లడాన్ని గమనించిన అధికారులు ఆమెపై నిఘా ఉంచారు. ఓ ఐపీఎస్ అధికారికి ఆమె దగ్గరి బంధువని వారు తెలిపారు. ఆమె ఎయిర్పోర్టులో దిగినప్పుడల్లా తాను డీజీపీ కూతురునని ప్రచారం చేసుకొనేదని తేలింది. ఇందులో అధికారుల పాత్రపైనా దర్యాప్తు చేస్తున్నారు.