బెంగళూర్ : ప్రముఖ కన్నడ నటుడు శివరాం శనివారం బెంగళూర్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో తుదిశ్వాస విడిచారు. 83 ఏండ్ల శివరాం మంగళవారం రాత్రి తన నివాసంలో పూజ చేస్తూ కుప్పకూలారు. శివరాంను కుటుంబ సభ్యులు దవాఖానకు తీసుకువెళ్లగా ఆయన బ్రెయిన్ హెమరేజ్‌తో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. వయసు రీత్యా ఆయనకు సర్జరీ చేయలేమని వైద్యులు పేర్కన్నారు. కొద్దిసేపటి కిందట శివరాం కన్నుమూయడంతో ఆయన అభిమానులు, సినీ పరిశ్రమకు చెందిన వారంతా శోకసంద్రంలో మునిగారు.
వారం కిందట శివరాంకు కారు ప్రమాదంలో స్వల్ప గాయాలయ్యాయి. 1938, జనవరి 28న జన్మించిన శివరాం 1958లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఆయన తన సినీ కెరీర్‌ను ప్రారంభించారు. కేఆర్ సీతారామ శాస్త్రి, పుట్టన్న కనగల్, సింగీతం శ్రీనివాసరావు వంటి అగ్ర దర్శకుల వద్ద శివరాం పనిచేశారు. 1965లో బెరెత జీవ అనే చిత్రంతో నటుడిగాను తెరంగేట్రం చేశారు. ఆపై క్యారెక్టర్ నటుడిగానూ శివరాం సత్తా చాటారు. 1972లో హృదయ సంగమ అనే చిత్రంతో శివరాం దర్శకుడిగా మారారు. కన్నడలో పలు సినిమాలు నిర్మించిన శివరాం రజనీకాంత్‌తో తమిళంలో ధర్మ దురై అనే సినిమాను నిర్మించారు.