బెంగళూరు: హత్య కేసు విచారణ ఎదుర్కొంటున్న దర్శన్‌కు సంబంధించి మరో విషయం కలకలం సృష్టించింది. బెంగళూరులోని దర్శన్ ఫామ్‌హౌస్‌లో అతని మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. మేనేజర్ సూసైడ్ నోట్, వీడియో మెసేజ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒంటరితనాన్ని భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన కుటుంబానికి సంబంధ లేదని స్పష్టం చేశాడు. అయితే వాస్తవానికి అతను చనిపోయింది ఈ రోజు కాదు ఈ ఏడాది ఏప్రిల్లోనని బెంగళూరు రూరల్ ఎస్పీ మల్లిఖార్జున్ స్పష్టం చేశారు. దర్శన్ ఫామ్‌హౌస్‌లో కాకుండా రెండు కిలోమీటర్ల దూరంలో ఆత్మహత్య చేసుకున్నట్టు న్యూస్ 18కు తెలిపారు.