Kamal Haasan : త్రిభాషా విధానంపై కేంద్ర ప్రభుత్వాని (Union government) కి, తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వానికి మధ్య గత కొన్నాళ్లుగా వివాదం నడుస్తోంది. ఈ వివాదంపై తాజాగా ‘మక్కల్ నీది మైయం (MNM)’ పార్టీ అధ్యక్షుడు, నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) స్పందించారు. ఇండియాను ‘హిందియా (Hidhia)’ గా ప్రయత్నం జరుగుతోందంటూ ఆయన కేంద్రంపై విమర్శలు గుప్పించారు. అన్ని రాష్ట్రాలు హిందీలో మాట్లాడేలా చేసి, ఎన్నికల్లో మెజారిటీ సాధించాలని కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
మనందరం ఇండియా గురించి ఆలోచిస్తుంటే వారు మాత్రం హిందియా గురించి ఆలోచిస్తున్నారని కేంద్రంలోని బీజేపీ నేతలను ఉద్దేశించి అన్నారు. డీలిమిటేషన్, భాషా అంశాలపై బుధవారం తమిళ పార్టీలు సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా ఆమోదించిన తీర్మానాన్ని కేంద్రానికి పంపాయి. 1971 జనాభా లెక్కల ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ అభ్యర్థించారు. ఈ సమావేశంలోనే కమల్ హాసన్ మాట్లాడుతూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు.