గౌహతి: శక్తిపీఠం కామాఖ్యాదేవి ఆలయ(Kamakhya Temple) ద్వారాలను ఇవాళ తెరిచారు. అంబుబాచీ జాతర సందర్భంగా నాలుగు రోజుల పాటు అమ్మవారి ఆలయాన్ని మూసివేశారు. ఇవాళ తెల్లవారుజామున ప్రత్యేక పూజలు చేసి ఆలయ తలుపులను తీశారు. వార్షిక రుతుస్త్రావం వేళ ఆలయ ద్వారాలను మూసి అంబుబాచీ మేళాను నిర్వహిస్తారు. బుధవారం రాత్రి నిబృత్తి పూజలు చేపట్టారు. భక్తులకు మాత్రం ఇవాళ ఉదయం ఆలయ ద్వారాలను అమ్మవారి దర్శనం కోసం తెరిచారు.
Jai Maa Kamakhya!!🙏🙏🙏🚩
The door of Maa Kamakhya temple has been reopened today after performing some sacred rituals by the priests. May Aadyashakti Bhagavati protect Her devotees n bless everyone with power, prosperity n good health. #AmbubachiNirbritti🙏 pic.twitter.com/5bE3JOLy7i— Manisha Kataki (@KatakiManisha) June 26, 2024
జూన్ 22వ తేదీన అంబుబాచీ మేళా ప్రారంభమైన విషయం తెలిసిందే. స్థానిక ప్రభుత్వ భారీ భద్రతా ఏర్పాట్లను చేసింది. సుమారు 25 లక్షల మంది అంబుబాచీ జాతరకు హాజరైనట్లు కామరూప మెట్రోపాలిటన్ జిల్లా అధికారులు తెలిపారు. ఆలయ తలుపులు మూసిన వేసిన తర్వాత ఆ గుడి పరిసరాల్లోనే అంబుబాచీ మేళా నిర్వహిస్తారు. భారీగా వచ్చే భక్తుల కోసం వేర్వేరు ప్రదేశాల్లో క్యాంపులను ఏర్పాటు చేశారు.