Kalpana Soren | ఎన్నో నెలల తర్వాత ఊరట : భర్తకు బెయిల్ దక్కడంపై కల్పనా సోరెన్
Kalpana Soren : భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు (Hemant Soren) జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని ఆయన భార్య కల్పనా సోరెన్ స్వాగతించారు.
Kalpana Soren : భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు (Hemant Soren) జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని ఆయన భార్య కల్పనా సోరెన్ స్వాగతించారు. ఎన్నో నెలల తర్వాత సంతోషకరమైన రోజు ఎదురైందని హర్షం వ్యక్తం చేశారు. కష్టకాలంలో తమకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆమె పేర్కొన్నారు.
మరోవైపు హేమంత్ సోరెన్‌కు బెయిల్ లభించడంపై కాంగ్రెస్ నేత అంబా ప్రసాద్ స్పందిస్తూ సోరెన్ అమాయకుడని తమకు తెలుసని, ఆయన రాక తమ బృందానికి మరింత బలం ఇస్తుందని చెప్పారు. ప్రతికూల పరిస్ధితుల్లోనూ జార్ఖండ్ ప్రభుత్వం నిబ్బరంతో పనిచేసిందని పేర్కొన్నారు. కాగా, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి (former Jharkhand Chief Minister) హేమంత్ సోరెన్ (Hemant Soren)కు భారీ ఊరట లభించింది.
భూ కుంభకోణం కేసు ( land scam case)లో అరెస్టైన ఆయనకు జార్ఖండ్ హైకోర్టు (Jharkhand High Court) తాజాగా బెయిల్ మంజూరు చేసింది. దీంతో రాంచీలోని బిర్సా ముండా జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆయన హైకోర్టు తీర్పుతో ఐదు నెలల తర్వాత జైలు నుంచి బయటకు రానున్నారు.జార్ఖండ్ ముఖ్యంమత్రిగా ఉన్న హేమంత్ సోరెన్‌ను భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జనవరి 31న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలకు సొరేన్ సమాధానం దాటవేస్తున్న క్రమంలో మనీలాండరింగ్ నియంత్రణ చట్టం(పీఎంఎల్ఏ) కింద ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి జైల్లోనే ఉన్న ఆయన దాదాపు ఐదు నెలల తర్వాత ఇప్పుడు బెయిల్‌పై బయటకు రాబోతున్నారు. కాగా, అరెస్ట్ అనంతరం సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన స్థానంలో జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ బాధ్యతలు చేపట్టారు.
Read More :
Harish Rao | ఎమ్మెల్సీ కవితతో మాజీ మంత్రి హరీష్ రావు ములాఖత్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

