రాంచీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ సతీమణి కల్పనా సొరేన్.. గాండే శాసనసభ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల బరిలో నిలిచారు. ఆమె జేఎంఎం అభ్యర్థిగా సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి చంపయీ సొరేన్, బావ బసంత్ సొరేన్, కాంగ్రెస్ జార్ఖండ్ శాఖ అధ్యక్షుడు రాజేశ్ ఠాకూర్, మంత్రులు అలంగిర్ ఆలం, సత్యానంద్ భోక్తా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జేఎంఎం ఎమ్మెల్యే సర్ఫరాజ్ అహ్మద్ రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ మే 20న జరుగుతుంది, ఫలితాలు జూన్ 4న వెలువడతాయి.