న్యూఢిల్లీ, నవంబర్ 21: తమిళనాడుకు చెందిన కల్పన బాలన్(26) అత్యధిక దంతాలు(38) కలిగిన మహిళగా గిన్నిస్ రికార్డు సృష్టించారు. ఆమెకు పై దవడలో నాలుగు, కింది దవడలో రెండు పళ్లు అదనంగా ఉన్నాయి.
యుక్త వయసులో ఈ పళ్లు మొలిచాయని వీటి వల్ల నొప్పేమీ లేదని.. తరచూ వాటి మధ్య ఆహారం చిక్కుకుపోయేదని ఆమె తెలిపారు. ‘గిన్నిస్ రికార్డు సాధించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది నా జీవితకాల విజయం’ అని కల్పన తెలిపారు. అదనపు దంతాలు కలిగి ఉండటాన్ని హైపర్డోంటియా అని పిలుస్తారు. అదనపు దంతాలు ఎందుకు ఏర్పడతాయో కచ్చితమైన కారణం తెలియదు.