ప్రయాగ్‌రాజ్, మార్చి 25 : ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేయాలన్న ప్రతిపాదనను నిరసిస్తూ అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్‌కు చెందిన న్యాయవాదులు మంగళవారం నిరవధిక సమ్మె ప్రారంభించారు.
నిరసనకు నాయకత్వం వహించిన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ తివారీ మాట్లాడుతూ ఈ నిరసన ఏ న్యాయస్థానానికో లేక న్యాయమూర్తికో వ్యతిరేకంగా చేస్తున్నది కాదని చెప్పారు. కమిటీ విచారణ ప్రారంభం జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నగదు లభించిన ఘటనపై విచారణ నిమిత్తం ఏర్పాటైన ముగ్గురు సభ్యులతో కూడిన అంతర్గత కమిటీ తన విచారణను ప్రారంభించినట్టు న్యాయ వర్గాలు తెలిపాయి.