న్యూఢిల్లీ: అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానాన్ని రానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆయనపై చర్య తీసుకోవడానికి అన్ని పార్టీల ఏకాభిప్రాయం కోసం ప్రభుత్వం ప్రయత్నించబోతున్నది. జస్టిస్ వర్మ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు దొరకడం కలకలం రేపిన విషయం తెలిసిందే.
జీ7 సదస్సుకు భారత్‌కు అందని ఆహ్వానం!
న్యూఢిల్లీ: కెనడాలో జూన్ 15 నుంచి 17 వరకు జరగనున్న జీ7 సదస్సులో పాల్గొనేందుకు భారత్‌కు ఇంకా ఆహ్వానం అందలేదు. గడచిన ఆరేళ్లలో మొట్టమొదటిసారి జీ7 సదస్సులో ప్రధాని మోదీ పాల్గొనడం లేదు. ఒకవేళ కెనడా నుంచి ఆహ్వానం అందినా రెండు దేశాల మధ్య ప్రస్తుతం సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఆ సదస్సులో ప్రధాని పాల్గొనేందుకు విస్తృతంగా గ్రౌండ్‌వర్క్ చేయాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత్, పాక్ మధ్య మధ్యవర్తిత్వానికి అమెరికాను అనుమతించి తప్పు చేసిన తర్వాత ఇది మరో దౌత్యపరమైన భంగపాటని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది.