న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మన్మోహన్ (61) గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. ఆయన చేత సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టులో మొత్తం జడ్జీల సంఖ్య 34 (సీజేఐతో సహా). ప్రస్తుతం జస్టిస్ మన్మోహన్తో కలిపి 33 మంది న్యాయమూర్తులు ఉన్నారు.