న్యూఢిల్లీ: ఐక్యరాజ్య సమితి అంతర్గత న్యాయమండలి చైర్‌పర్సన్‌గా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ నియమితులయ్యారు. 2028 నవంబర్ 12 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ఐరాస సెక్రటరీ జనరల్ గుటెర్రెస్ తెలిపారు.
జస్టిస్ లోకూర్ ఫిజీ సుప్రీం కోర్టులోని నాన్ రెసిడెంట్ ప్యానల్‌కు 2019లో జడ్జీగా నియమితులయ్యారు. విదేశీ సుప్రీం కోర్టులో న్యాయమూర్తిగా మన దేశ సుప్రీం కోర్టు న్యాయమూర్తి నియమితులు కావడం అదే ప్రథమం. లోకూర్ 2012లో సుప్రీం కోర్టు జడ్జీగా బాధ్యతలు చేపట్టి 2018 డిసెంబర్ వరకు కొనసాగారు.