Justice BV Nagarathna | మహిళలను తక్కువగా చూడడం మానాలి : జస్టిస్ బీవీ నాగరత్న
Justice BV Nagarathna | కుటుంబ, వివాహ వ్యవస్థను కాపాడుకోవడం చాలా ముఖ్యమని.. ఇందుకోసం ఇతరులకంటే తమను తాము ముఖ్యమైనదిగా భావించే వ్యక్తిత్వాన్ని వదులుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న అన్నారు.
Justice BV Nagarathna | కుటుంబ, వివాహ వ్యవస్థను కాపాడుకోవడం చాలా ముఖ్యమని.. ఇందుకోసం ఇతరులకంటే తమను తాము ముఖ్యమైనదిగా భావించే వ్యక్తిత్వాన్ని వదులుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న అన్నారు. వివాహబంధంలో మహిళల ప్రాముఖ్యతను గుర్తించాల్సి ఉంటుందని, వారిని తక్కువగా చూడడం మానేయాలని పిలుపునిచ్చారు.
జస్టిస్ సునంద భండారే స్మారక జస్టిస్ సునంద భండారే స్మారక ఉపన్యాసంలో జస్టిస్ బీవీ నాగరత్న ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ నాగరత్న మాట్లాడుతూ పురుషులు, స్త్రీలు వివాహానికి రెండు ముఖ్యమైన స్తంభాలని, కుటుంబం చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుందని.. కానీ, గృహహింస సంఘటనలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పురుషులు తమ స్వీయ ముఖ్యమైన వ్యక్తిత్వాన్ని వదులుకోవాల్సి ఉంటుందన్నారు.
వివాహం, కుటుంబం అనే వ్యవస్థ మనుగడ సాగించాలని.. ఆనందం, కుటుంబం మహిళల శ్రేయస్సుపై ఆధారపడి ఉండాలన్నారు. కుటుంబంలో మహిళల గుర్తింపు పోతే ఏదో ఒక రోజు వైవాహిక బంధం తెగిపోవడం ఖాయమన్నారు. ప్రతి విజయవంతమైన వ్యక్తి వెనుక ఒక కుటుంబం ఉంటుందని.. వివాహంలో మహిళల పాత్రను తక్కువగా అంచనా వేయకూడదన్నారు. వివాహాల విచ్ఛిన్నం పిల్లలపై సైతం ప్రభావం చూపుతుందని జస్టిస్ నాగరత్న అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టెన్త్‌లో టాపర్లకు ఢిల్లీ విమాన ప్రయాణ బహుమతి
రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు
FMG Doctor | రాజస్థాన్‌లో 15 రోజుల్లోనే జీవో పాసైంది.. మన దగ్గరే ఎందుకు ఆలస్యం..?: కాంగ్రెస్ సర్కార్‌పై ఎఫ్ఎంజీ డాక్టర్ ఫైర్
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

