న్యూఢిల్లీ : జాతీయ న్యాయ సేవల అథారిటీ (నల్సా) కార్యనిర్వాహక అధ్యక్షునిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ నియమితులయ్యారు. 11 నుంచి ఆయన బాధ్యతలు చేపడతారని కేంద్ర న్యాయశాఖ తెలిపింది. ఈ అథారిటీ సమాజంలోని బలహీన వర్గాలకు ఉచితంగా న్యాయ సేవలను అందిస్తుంది.
అథారిటీకి ప్యాట్రన్-ఇన్-చీఫ్‌గా సీజేఐ వ్యవహరిస్తారు. సీజేఐ తర్వాత సీనియర్ మోస్ట్ జడ్జి ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్‌గా పని చేస్తారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా సీజేఐ కావడంతో జస్టిస్ గవాయ్ సీజేఐ తర్వాత సీనియర్ మోస్ట్ జడ్జి అవుతారు.