బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Mar 18, 2020 , 02:11:28

ఐసీజే పరిధిలోకి రాదు

ఐసీజే పరిధిలోకి రాదు

-నిర్భయ కేసుపై జస్టిస్‌ బీఎన్‌ శ్రీకృష్ణ వ్యాఖ్య

-దోషులకు అన్ని అవకాశాలు కల్పించారని వెల్లడి

న్యూఢిల్లీ, మార్చి 17: నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన నలుగురు ఖైదీలకు ఈ నెల 20న మరణశిక్ష అమలును నిలిపివేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) స్టే మంజూరు చేయలేదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బీఎన్‌ శ్రీకృష్ణ పేర్కొన్నారు. ఈ కేసులో ఆదేశాలు జారీ చేయడానికి ఐసీజేకు అధికారం లేదని మంగళవారం తెలిపారు. ఐసీజే అధికారాల పరిధిని సభ్య దేశాలు అంగీకరించాల్సి ఉంటుందన్నారు. ఈ కేసులో తమను ‘గినియా పందుల’ మాదిరిగా పరిగణిస్తూ విచారణ జరిపి, దోషులుగా నిర్ధారించడం పొరపాటని, తమను చట్ట విరుద్ధంగా ఉరితీయడంపై స్టే విధించాలని నిర్భయ కేసులోని నలుగురు దోషులు ఐసీజేను ఆశ్రయించిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ కేసులో దోషి అక్షయ్‌ కుమార్‌ క్షమాభిక్ష కోసం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు రెండోసారి పిటిషన్‌ పెట్టుకున్నాడు. ఇదిలా ఉంటే, ఈ కేసులో ఉరిశిక్ష పడనున్న ఖైదీ అక్షయ్‌ భార్య పునీతా దేవి.. బీహార్‌లోని ఔరంగాబాద్‌ జిల్లా కోర్టులో తన భర్త (అక్షయ్‌) నుంచి విడాకులు కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో తన భర్త అమాయకుడని ఆమె వాదించారు. తన భర్త మరణించిన తర్వాత తాను విధవరాలిగా జీవించాలని భావించడం లేదని, అందువల్లే ఆయన జీవించి ఉండగానే విడాకులు మంజూరు చేయాలని కోరారు.


logo
>>>>>>