న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ విపుల్ మనుభాయ్ పంచోలీ శుక్రవారం ప్రమాణం చేశారు. వీరిద్దరి చేత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణం చేయించారు.
సుప్రీంకోర్టుకు మం జూరైన 34 న్యాయమూర్తి పదవులు వీరిద్దరి రాకతో పూర్తిగా భర్తీ అయ్యా యి. సీజేఐతో కలిపి ప్రస్తుతం 34 మంది జడ్జిలు ఉన్నారు.