యువత ప్రతిభనే భారత దేశ బలం.. WITT సమ్మిట్‌లో జూపల్లి రాము
భారత మానవ వనరుల శక్తి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందుతున్నదని మైహోమ్ గ్రూప్ వైస్ చైర్మన్ జూపల్లి రాము తెలిపారు. ప్రస్తుతం ప్రపంచం 'పాలీ క్రైసిస్' వంటి ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, భారత్ మాత్రం స్థిరంగా ఎదుగుతోందని పేర్కొన్నారు.
భారత మానవ వనరుల శక్తి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందుతున్నదని మైహోమ్ గ్రూప్ వైస్ చైర్మన్ జూపల్లి రాము తెలిపారు. ప్రస్తుతం ప్రపంచం ‘పాలీ క్రైసిస్’ వంటి ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, భారత్ మాత్రం స్థిరంగా ఎదుగుతోందని పేర్కొన్నారు. మార్చి 23, 24వ తేదీల్లో ప్రముఖ టీవీ నెట్వర్క్ నిర్వహించిన ప్రతిష్టాత్మక ‘What India Thinks Today (WITT)’ 2026 సమ్మిట్‌లో మైహోమ్ గ్రూప్ వైస్ చైర్మన్ జూపల్లి రాము ప్రసంగం అందర్నీ ఆకర్షించింది. ఈ సమ్మిట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన హృదయపూర్వక స్వాగతం పలికారు.
అనంతరం జూపల్లి రాము మాట్లాడుతూ.. దేశ యువతపై ప్రపంచానికి పెరుగుతున్న నమ్మకం, ప్రజాస్వామ్యం, జనాభా శక్తి, వైవిధ్యం వంటి అంశాలు భారత దేశానికి బలాలు అని స్పష్టం చేశారు. ప్రస్తుతం భారత్ సుమారు 7 శాతం వృద్ధిరేటుతో ముందుకు సాగుతూ, ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా దూసుకెళ్తోందని తెలిపారు. డిజిటల్ మౌలిక సదుపాయాలు, యువతకు అందుతున్న అవకాశాలు దేశాన్ని ప్రత్యేకంగా నిలబడుతున్నాయని చెప్పారు.
భారత మానవ వనరుల శక్తికి ఆధారమైన కీలక అంశాలను కూడా ఆయన వివరించారు:
1.యువ జనాభా
2.ఆంగ్ల భాషపై పట్టు
3.STEM రంగాల్లో ప్రతిభ
4.డిజిటల్ సామర్థ్యం & డేటా వినియోగం
5.అంతర్జాతీయ అంశాలపై బలమైన అవగాహన
6.సాంకేతికతను త్వరగా అలవాటు చేసుకునే నైపుణ్యం
7. సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోగలిగే సామర్థ్యం
ఈ అన్ని అంశాలు కలిసి భారత్‌ను గ్లోబల్ టాలెంట్ హబ్‌గా నిలబెడుతున్నాయని జూపల్లి రాము రావు స్పష్టం చేశారు.
ఈ గ్లోబల్ సమ్మిట్‌లో జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, పాలన, ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్యం, సంస్కృతి, క్రీడలు వంటి విభిన్న అంశాలపై చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన కీలక ప్రసంగంలో భారత్ గ్లోబల్ స్థాయిలో పెరుగుతున్న ప్రభావాన్ని ప్రస్తావించారు. గత కొన్ని సంవత్సరాల్లో ప్రపంచ దృష్టిలో భారత్ స్థానం మారిందని, టెక్నాలజీ వినియోగదారుడి నుంచి ఉత్పత్తిదారుగా ఎదిగిందని పేర్కొన్నారు. అలాగే పాలసీ, వ్యాపారం, టెక్నాలజీ రంగాల ప్రముఖులతో భారత్ గ్లోబల్ ప్రయాణం, ఎదుగుదలపై ఈ సమ్మిట్ చర్చలకు వేదికగా నిలుస్తుందని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
Singur Drinking Water | సింగూరు ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్ల కోసం రూ.120 కోట్లు మంజూరు
Shashi Tharoor: ఇందిరా గాంధీని ఇంటర్వ్యూ చేసిన శశిథరూర్.. ఆనాటి ఫోటో షేర్ చేసిన కాంగ్రెస్ ఎంపీ
Satyavathi Rathod | సత్యవతి రాథోడ్‌కు కేటీఆర్ బర్త్ డే విషెస్.. వీడియో
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

