న్యూఢిల్లీ, మార్చి 19: ఢిల్లీ మద్యం పాలసీ కేసులను ప్రారంభం నుంచి విచారిస్తున్న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్పాల్ మంగళవారం బదిలీ అయ్యారు. నాగ్పాల్ స్థానంలో కొత్త న్యాయమూర్తిగా జడ్జి కావేరీ భవేజా నియమితులయ్యారు. తీస్ హజారీ కోర్టులో న్యాయమూర్తిగా నాగ్పాల్ కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు.
హైకోర్టు జారీచేసిన లిస్టు ప్రకారం నాగ్పాల్తో సహా ఢిల్లీ హైకోర్టు జ్యుడీషియల్ సర్వీసెస్ (డీహెచ్జేఎస్) పరిధిలోని మొత్తం 27 మంది జడ్జిలు బదిలీ అయ్యారు. మరోవైపు ఢిల్లీ జ్యుడీషియ ల్ సర్వీసెస్(డీజేఎస్)కు చెందిన 31 మంది జడ్జీలు కూడా ట్రాన్స్ఫర్ అయ్యారు.