రెండేళ్ల తర్వాత జర్నలిస్టు సిద్ధిక్ కప్పన్ రిలీజ్
Journalist Siddique Kappan : జర్నలిస్టు కప్పన్ రిలీజైయ్యాడు. మనీ ల్యాండరింగ్ కేసులో అతను రెండేళ్ల జైలు శిక్ష అనుభవించాడు. యూపీలోని హత్రాస్‌లో అతన్ని అరెస్టు చేశారు.
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో అరెస్టు అయిన కేరళ జర్నలిస్టు సిద్దిక్ కప్పన్‌ను ఇవాళ రిలీజ్ చేశారు. రెండేళ్ల తర్వాత అతన్ని జైలు నుంచి విడుదల చేశారు. రెండు కేసుల్లో బెయిల్ వచ్చి నెల రోజులు అవుతున్నా.. లక్నోలోని స్పెషల్ కోర్టు కప్పన్‌ను రిలీజ్ చేస్తూ ఆదేశాలపై సంతకం చేసింది. రాక్షస చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేయనున్నట్లు జైలు రిలీజైన తర్వాత కప్పన్ తెలిపాడు. బెయిల్ వచ్చినా జైల్లో పెట్టారని, రెండేళ్లు కఠినంగా సాగినా, ఎప్పుడూ భయపడలేదని కప్పన్ చెప్పాడు.
కప్పన్‌ను 2020 అక్టోబర్‌లో అరెస్టు చేశారు. హత్రాస్‌లో జరిగిన రేప్ ఘటనను రిపోర్ట్ చేసేందుకు వెళ్తున్న సమయంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళన చెలరేగింది. అతనిపై దేశద్రోహం కేసు బుక్ చేశారు. 2022 ఫిబ్రవరిలో అతనిపై మనీల్యాండరింగ్ కేసు కూడా నమోదు చేశారు. నిషేధిత పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బులు తీసుకున్నట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి.
టెర్రర్ కేసులో గత ఏడాది సెప్టెంబర్‌లో అతని బెయిల్ వచ్చింది. ఇక డిసెంబర్లో అతనిపై మనీల్యాండరింగ్ కేసు బుక్కైంది. కానీ అనేక కారణాల వల్ల అతని రిలీజ్‌ను నిలిపివేశారు. టెర్రర్ ఫైనాన్సింగ్‌తో తనకు ఎటువంటి సంబంధం లేదని కప్పన్ తెలిపాడు. కేవలం జర్నలిస్టుగా వార్తలను కవర్ చేసేందుకు హత్రాస్‌కు వెళ్లినట్లు అతను చెప్పాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

