PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
PM Modi: చత్తీస్‌ఘడ్‌లోని బస్తర్ జిల్లాలో ఉన్న భద్రతా బలగాలతో.. ఇవాళ ప్రధాని మోదీ దీపావళి సంబరాలను జరుపుకున్నారు. బస్తర్‌లో నక్సలిజం ముగిసిన తర్వాత జరుగుతున్న తొలి దీపావళి వేడుక అని ఆయన అన్నారు. దిమాగీ నక్సల్స్‌పై ఆయన ఓ హెచ్చరిక చేశారు.
న్యూఢిల్లీ: చత్తీస్‌ఘడ్‌లోని బస్తర్ జిల్లాలో ఉన్న భద్రతా బలగాలతో.. ఇవాళ ప్రధాని మోదీ(PM Modi) దీపావళి సంబరాలను జరుపుకున్నారు. బస్తర్‌లో నక్సల్స్‌తో పోరాడిన భద్రతా దళాలను ఆయన సత్కరించారు. ఒకప్పుడు నక్సలిజంకు బస్తర్ జిల్లా కేంద్ర బిందువుగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ ప్రాంతాన్ని నక్సలిజం నుంచి విముక్తి చేశారు. అక్కడ ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మీ త్యాగాల వల్లే .. నక్సల్ ఉగ్రవాదాన్ని అంతం చేసినట్లు ఆయన చెప్పారు. ఈ ప్రాంతంలో నక్సలిజం ముగిసిన తర్వాత జరుగుతున్న తొలి దీపావళి వేడుక అని ఆయన అన్నారు.
అడవుల్లో నక్సల్స్ అంతం అయ్యారని, కానీ దిమాగీ నక్సల్స్ మాత్రం ఇంకా దాక్కుని ఉన్నట్లు ఆయన చెప్పారు. వివిధ సంస్థల్లో దిమాగీ నక్సల్స్ చొరబడినట్లు ఆయన చెప్పారు. దేశ సరిహద్దుల్లో సైనికులు ఎంత ముఖ్యమో.. దేశం లోపల తీవ్రవాదాన్ని ఎదుర్కోవడం కూడా అంతే ముఖ్యమన్నారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు అంతర్గత భద్రత కీలకమైందని ప్రధాని తెలిపారు. దేశ అంతర్గత భద్రత బలంగా ఉంటే, బయటి శత్రువులు దరిచేరరని, ఒకవేళ అంతర్గత భద్రత బలహీనపడితే, అప్పుడు బయటి శత్రువులు తలలు ఎత్తుకుంటారని ఆయన అన్నారు.
వామపక్ష తీవ్రవాదాన్ని బస్తర్ నుంచి తరిమేయాలని కేంద్రం తీవ్ర ప్రయత్నం చేసింది. సీఆర్పీఎఫ్తో పాటు చత్తీస్ఘడ్ పోలీసులు .. యాంటీ నక్సల్స్ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. దేశంలో నక్సలిజం ముగిసినట్లు మార్చి 31వ తేదీన కేంద్రం ప్రకటన చేసింది. అనేక మంది సీనియర్ నేతలు, క్యాడర్‌ను ఎలిమినేట్ చేసినట్లు ప్రభుత్వం ఆ ప్రకటన చేసింది. దీంతో పాటు వందలాది మంది నక్సలైట్లు తమ ఆయుధాలను అప్పగించి లొంగిపోయారు.
#WATCH | Prime Minister Narendra Modi celebrates #Diwali🪔with secuirty personnel in Bastar, Chhattisgarh
PM Modi says, “You are all a part of my family. This time, I have come to celebrate Diwali in the forests of Bastar. This is a land where the menace of Naxalism once prevailed. However, owing to your sacrifice and dedication, the menace of Naxalism has now ended in this very region, and a new wave of development has begun.”
(Source: DD)
— ANI (@ANI) November 8, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

