Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
Arjun Rajput: పాక్ బౌలర్లతో అర్జున్ రాజ్‌పుత్ ఆడుకున్నాడు. ఆసియా అండర్19 వన్డే టోర్నీలో అతను సెంచరీ చేశాడు. ఒకవైపు భారత బ్యాటర్లు టపటపా రాలిపోతున్నా.. అతను మాత్రం బౌండరీల మోత మోగించాడు. 107 రన్స్ చేసి అర్జున్ ఔటయ్యాడు.
ఒమన్: ఆసియాకప్ అండర్-19 టోర్నీలో భాగంగా ఇవాళ పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాటర్ అర్జున్ రాజ్‌పుత్(Arjun Rajput) ఒంటరి పోరాటం చేశాడు. రాజ్‌పుత్ ఒక్కడే బ్యాటింగ్‌లో పాక్ బౌలర్లను ఎదుర్కొన్నాడు. అల్ అమరాత్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ చేశాడు. అతను 85 బంతుల్లో 107 రన్స్ చేసి నిష్క్రమించాడు. అర్జున్ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, అయిదు సిక్సర్లు ఉన్నాయి.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు కలిసిరాలేదు. టాపార్డర్ బ్యాటర్లు అందరూ త్వరత్వరగా ఔటయ్యారు. ఓపెనర్ ఆర్యవీర్ సెహ్వాగ్ 22 రన్స్ చేశాడు. అయితే మిడిల్ ఆర్డర్లో వచ్చిన అర్జున్ మాత్రం తన సహజ శైలిలో బ్యాటింగ్ కొనసాగించాడు. పాక్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఒకవైపు వికెట్లు పడిపోతున్నా.. అర్జున్ మాత్రం బౌండరీలు బాదేశాడు.
తాజా సమాచారం ప్రకారం ఇండియా అండర్ 19 జట్టు 38.2 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 రన్స్ చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

