Johnson & Johnson: జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోసు టీకాకు ఆమోదం

న్యూఢిల్లీ: జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ సింగిల్ డోసు కోవిడ్ టీకాకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అత్యవసర వినియోగం కింద ఆ టీకాలను ఇవ్వవచ్చు అని ఇవాళ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్ మాండవీయ తన ట్విట్టర్లో వెల్లడించారు. దీంతో భారత్ తన వ్యాక్సిన్ సామర్థ్యాన్ని పెంచేసింది. జాన్సన్ అండ్ జాన్సన్‌కు అత్యవసర వినియోగం కోసం ఆమోదం దక్కడంతో.. భారత్‌లో వినియోగించనున్న అయిదవ టీకా కానున్నది. యురోపియన్ యూనియన్ ఏజెన్సీ ఆమోదం పొందిన 5 టీకాలు మన వద్ద ఉన్నట్లు మంత్రి తన ట్విట్టర్లో తెలిపారు. జాన్సన్ సింగిల్ డోసు రాకతో.. కోవిడ్‌పై పోరాటం మరింత బలోపతం అవుతుందని మంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా కోవాగ్జిన్, కోవీషీల్డ్, స్పుత్నిక్, మోడెర్నా టీకాల అత్యవసర వినియోగానికి ఆమోదం దక్కిన విషయం తెలిసిందే.
India expands its vaccine basket!
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) August 7, 2021
Johnson and Johnson’s single-dose COVID-19 vaccine is given approval for Emergency Use in India.
Now India has 5 EUA vaccines.
This will further boost our nation's collective fight against #COVID19
ఆగస్టు 5వ తేదీన సింగిల్ డోసు అప్రూవల్ కోసం జాన్సన్ కంపెనీ భారత ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నది. హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఈ సంస్థతో జాన్సన్ కంపెనీ ఈ టీకాను ఉత్పత్తి చేయనున్నది. సింగిల్ షాట్ వ్యాక్సిన్‌తో కరోనా వైరస్‌ను 85 శాతం సమర్థవంతంగా నిర్మూలించే అవకాశాలు ఉన్నాయి. మూడవ దశ క్లినికల్ ట్రయల్స్‌తో జాన్సన్ టీకా సామర్థ్యం తేలింది. వ్యాక్సిన్ తీసుకున్న 28 రోజుల తర్వాత ఆ టీకా ప్రభావం అధికంగా ఉన్నట్లు గుర్తించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

