శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఓ వ్యక్తి ప్రభుత్వ భూమిని ఆక్రమించి భారీ భవంతిని నిర్మిస్తున్నాడు. ఇది అధికారుల దృష్టికి రావడంతో వారు ఇవాళ సిబ్బంది, పోలీస్ బందోబస్తుతో వెళ్లి ఆ నిర్మాణంలో ఉన్న భవనాన్ని కూల్చివేశారు.
పుల్వామా జిల్లా రాజ్పొరాలోని న్యూ కాలనీ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, ఆ భవనాన్ని నిర్మిస్తుందని పేరు మోసిన ఉగ్రవాది ఆశిక్ నంగ్రూ అని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.