రాంచి, ఆగస్టు 20: జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(జేపీఎస్సీ) పరీక్షలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర హైకోర్టు గురువారం స్టే విధించింది.గురువారం జరిగిన విచారణలో 15 రోజుల్లోగా తన స్పందనను దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
జేపీఎస్సీ,-జేఎస్ఎస్సీ నియామక పరీక్షల్లో అవినీతి, అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో జార్ఖండ్ ప్రభుత్వం ఈనెల 17న 22 నియామక పరీక్షలను రద్దు చేసింది. వీటిలో జేపీఎస్సీ 14వ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష, జేఎస్ఎస్సీ-సీజీఎల్ పరీక్ష ఉన్నాయి. దర్యాప్తు బాధ్యతను సీఐడీకి అప్పగించింది. ఈ పరీక్షల ద్వారా వివిధ విభాగాల్లో మొత్తం 2,394 మంది అధికారులు నియమితులయ్యారు. వారి నియామకాలు రద్దవుతాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పలువురు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు.