న్యూఢిల్లీ : జేఈఈ మెయిన్ సెషన్ 1ని మంగళవారం నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. ఈ నెల 28, 29, 30 తేదీల్లో పరీక్షలకు హాజరు కావాల్సిన అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చునని తెలిపింది. ఈ పరీక్షల్లో తొలి సెట్ ఈ నెల 22, 23, 24 తేదీల్లో జరిగాయి. తదుపరి సెట్ పరీక్షలు ఈ నెల 28, 29, 30 తేదీల్లో జరుగుతాయి. అడ్మిట్ కార్డులపై నిర్దేశించిన సమయానికి పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు హాజరు కావాలి. తలుపులు మూసేసిన తర్వాత అభ్యర్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వరు.