హైదరాబాద్, జనవరి 18(నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్ -1 అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఈ నెల 22, 23, 24 తేదీల్లో పరీక్షలకు హాజరయ్యే వారి అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శనివారం విడుదల చేసింది.
అయితే 28, 29, 30 తేదీల్లో జేఈఈ మెయిన్ పరీక్షలను నిర్వహించనుండగా ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఎన్టీఏ త్వరలోనే విడుదల చేయనుంది. జేఈఈ మెయిన్ పరీక్షలు ఈ నెల 22 నుంచి 30 వరకు ఆన్లైన్లో జరగనున్నాయి. ఈ ఏడాది జేఈఈ మెయిన్ -1కు 13.8 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ నుంచి 40 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు అంచనా.