Anant Singh : జేడీయూ ఎమ్మెల్యే (JDU MLA) అనంత్‌సింగ్ (Ananth Singh) ఆస్పత్రిలో సిగరెట్ తాగాడు. అది ఆస్పత్రి అనే సోయి కూడా లేకుండా అనంత్ సింగ్ సిగరెట్ (Cigarett) తాగుతున్న వీడియో సోషల్ మీడియా (Social Media) లో వైరల్‌గా మారింది. అతడి తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అనంత్‌సింగ్‌ను బేయూర్ జైల్లో పెట్టిన సందర్భంగా వైద్యపరీక్షలకు తీసుకెళ్లిన సమయంలో ఆయన ఇలా స్మోక్ చేశాడు. పట్నాలోని ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (IGIMS) ఆ ఘటన చోటుచేసుకుంది. ఆ స్మోకింగ్ వీడియోను ఆర్జేడీ అధికార ప్రతినిధి ప్రియాంకా భారతి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఆ వీడియోకు ‘అనంత్ సింగ్ సుపరిపాలనను పొగ రూపంలో ఊదుతున్నాడు’ అనే క్యాప్షన్‌ను జతచేశారు.
అంతేగాక ‘నితీశ్‌గారు ఎంతో గారాబంగా చూసుకునే విలన్ ఆస్పత్రిలో సిగరెట్లు తాగుతూ రీల్స్ చేస్తున్నాడు’ మరో లైన్ జతచేశారు. అనంత్‌సింగ్ వీడియోపై బీజేపీ, జేడీయూ ఎందుకు మౌనంగా ఉంటున్నాయని ఆర్జేడీకి చెందిన మరో అధికార ప్రతినిధి ఎజాజ్ అహ్మద్ ప్రశ్నించారు.
“नायक नहीं खलनायक है तू…”
सुशासन को धुएं में उड़ाता हुआ अनंत सिंह!नीतीश जी का दुलारा खलनायक अस्पताल में सिगरेट पीते हुए रीलबाजी कर रहे है!
pic.twitter.com/wQrpEVhAZY— Priyanka Bharti (@priyanka2bharti) January 18, 2026