KC Tyagi | పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి.. జేడీ(యూ) సీనియర్ నేత రాజీనామా
KC Tyagi | బీహార్‌లో అధికారంలో ఉన్న జనతాదళ్ (యునైటెడ్) సీనియర్ నాయకుడు కేసీ త్యాగి ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ నాయకత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
పాట్నా: బీహార్‌లో అధికారంలో ఉన్న జనతాదళ్ (యునైటెడ్) సీనియర్ నాయకుడు కేసీ త్యాగి (KC Tyagi) ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ నాయకత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ పార్టీ ఆదివారం ఈ విషయాన్ని తెలిపింది. త్యాగి స్థానంలో రాజీవ్ రంజన్ ప్రసాద్‌ను పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమించనున్నట్లు ప్రకటించింది.
కాగా, కేసీ త్యాగి ఇటీవల పలు అంశాలపై చేసిన ప్రకటనలు వివాదస్పదమయ్యాయి. ఇజ్రాయెల్‌కు ఆయుధాల సరఫరాను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. అలాగే గాజాలో శాంతి, కాల్పుల విరమణకు భారత్ మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. అయితే పార్టీ నాయకత్వాన్ని సంప్రదించకుండానే త్యాగి ఈ ప్రకటనలు చేసినట్లు జేడీ(యూ) విమర్శించింది. ఆయన వ్యాఖ్యల కారణంగా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే)లో విభేదాలు తలెత్తినట్లు ఆ పార్టీ వర్గాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో జాతీయ అధికార ప్రతినిధి పదవికి కేసీ త్యాగి రాజీనామా చేసినట్లు తెలుస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

