చెన్నై: తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత మరణం(Jayalalithaas death)పై విచారణ చేపట్టాలని మాజీ జడ్జి అరుముగస్వామి కమిషన్ తన రిపోర్ట్‌లో అభిప్రాయపడ్డారు. జయలలిత ఏ రోజున, ఎన్ని గంటలకు మరణించిందో ఆ రిపోర్ట్‌లో పొందుపరిచారు. అయితే జయ మరణంపై అపోల్ హాస్పిటల్ ఇచ్చిన స్టేట్మెంట్ సరిగా లేదని కమిషన్ తన రిపోర్ట్‌లో తెలిపింది.
అపోలో నివేదిక ప్రకారం 2016, డిసెంబర్ అయిదో తేదీన రాత్రి 11.30 నిమిషాలకు జయ ప్రాణాలు విడిచారు. జయ తుది శ్వాస విడిచిన సమయంపై వివాదం చెలరేగుతోంది. జయ మరణించిన సమయంపై అనుమానాలు వ్యక్తం అయినట్లు తెలుస్తోంది.
జయకు, ఆమె స్నేహితురాలు శశికళ మధ్య కూడా 2012 నుంచి సంబంధాలు సరిగా లేవని కూడా మాజీ జడ్జి తన రిపోర్ట్‌లో ఆరోపించారు. జడ్జి అరుముగస్వామి రూపొందించిన రిపోర్ట్‌ను ఇవాళ తమిళనాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
శశికళ, డాక్టర్ కేఎస్ శివకుమార్, అప్పటి ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్, ఆరోగ్య మంత్రి సీ విజయభాస్కర్ తీరును కూడా అరుముగస్వామి కమిషన్ తప్పుపట్టింది. ఈ అందరిపై విచారణ చేపట్టాలని ఆ రిపోర్ట్‌లో జడ్జి కోరారు.
అపోల్ హాస్పిటల్లో ఉన్న జయకు ఎయిమ్స్ వైద్యుల బృందం సరైన వైద్యం అందించలేదని కమిషన్ తన రిపోర్ట్‌లో తెలిపింది.అమెరికా నుంచి వచ్చిన డాక్టర్ సమీన్ శర్మ.. జయకు హార్ట్ సర్జరీ చేయాలని సూచించారు. కానీ ఆ సర్జరీ జరగలేదని రిపోర్ట్‌లో తెలిపారు.