Jaya Bachchan | ఐదోసారి రాజ్యసభకు నామినేషన్.. రూ.1,578 కోట్ల ఆస్తులను ప్రకటించిన జయా బచ్చన్
Jaya Bachchan | దేశంలో అత్యంత ధనిక ఎంపీగా పేరు పొందిన నటి, బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) భార్య జయా బచ్చన్ (Jaya Bachchan) వరుసగా ఐదోసారి రాజ్యసభ (Rajya Sabha)కు నామినేట్ అయిన విషయం తెలిసిందే.
Jaya Bachchan | దేశంలో అత్యంత ధనిక ఎంపీగా పేరు పొందిన నటి, బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) భార్య జయా బచ్చన్ (Jaya Bachchan) వరుసగా ఐదోసారి రాజ్యసభ (Rajya Sabha)కు నామినేట్ అయిన విషయం తెలిసిందే. సమాజ్ వాదీ పార్టీ (Samajwadi Party) తరఫున ఆమె ఐదోసారి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన కుటుంబ ఆస్తుల వివరాలను వెల్లడించారు.
2004 నుండి సమాజ్ వాదీ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యురాలిగా పనిచేసిన జయా బచ్చన్ ఎన్నికల అఫిడవిట్ (election affidavit)లో రూ.1,578 కోట్ల విలువైన ఆస్తులను ప్రకటించారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ వ్యక్తిగత నికర విలువ రూ.1,63,56,190 కాగా, అదే కాలానికి తన భర్త అమితాబ్ బచ్చన్ సంపద రూ.273,74,96,590గా ఎన్నికల అఫిడవిట్లో జయా బచ్చన్ పొందుపరిచారు. ఇక ఉమ్మడి చరాస్తుల విలువ రూ. 849.11 కోట్లుగా, స్థిరాస్తి మొత్తం రూ.729.77 కోట్లుగా పేర్కొన్నారు. తన బ్యాంక్ బ్యాలెన్స్ రూ.పది కోట్లు (10,11,33,172)గా చూపించారు. తన భర్త అమితాబ్ బచ్చన్ బ్యాంక్ బ్యాలెన్స్ రూ.120,45,62,083గా వెల్లడించారు.
ఇక ఈ జంట వద్ద మొత్తం రూ.90 కోట్లకు పైగా విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయి. తన వద్ద రూ. 40.97 కోట్ల విలువైన ఆభరణాలు ఉన్నట్లు జయా బచ్చన్ ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచారు. తన భర్త వద్ద రూ. 54.77 కోట్ల విలువైన ఆభరణాలు ఉన్నట్లు వెల్లడించారు. తన పేరుపై రూ. 9.82 లక్షల విలువైన వాహనాలు ఉన్నట్లు పేర్కొన్నారు. అమితాబ్ వద్ద రెండు మెర్సిడెస్, రేంజ్ రోవర్ సహా 16 వాహనాలు ఉన్నట్లు తెలిపారు. వాటి విలువ మొత్తం రూ. 17.66 కోట్లుగా వెల్లడించారు.
Also Read..
Elon Musk:ఉక్రెయిన్ నుంచి వెనక్కి తగ్గితే.. పుతిన్‌ను అంతం చేస్తారు: ఎల్లన్ మస్క్
Assembly | అసెంబ్లీలో బడ్జెట్‌పై కొనసాగుతున్న చర్చ.. సభలో కోరం లేదని బీఆర్ఎస్ అభ్యంతరం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

