Elon Musk:ఉక్రెయిన్ నుంచి వెనక్కి తగ్గితే.. పుతిన్‌ను అంతం చేస్తారు: ఎల్లన్ మస్క్
Elon Musk: ఎల్లన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఉక్రెయిన్ యుద్ధం నుంచి పుతిన్ వెనక్కి తగ్గితే, అప్పుడు అతన్ని హత్య చేసినా ఆశ్చర్యంలేదన్నారు. సోమవారం ఓ సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో పుతిన్ ఓడిపోడు అని ఆయన స్పష్టం చేశారు.
న్యూయార్క్: టెస్లా కంపెనీ ఓనర్ ఎల్లన్ మస్క్(Elon Musk) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఉక్రెయిన్ యుద్ధం నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెనక్కి తగ్గితే, అప్పుడు అతన్ని హత్య చేసినా ఆశ్చర్యంలేదన్నారు. సోమవారం ఓ ఫోరంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో పుతిన్ ఓడిపోడు అని ఆయన స్పష్టం చేశారు. యుద్ధంతో సతమతం అవుతున్న ఉక్రెయిన్‌కు మరింత సహాయాన్ని అందించాని సేనేట్‌లో బిల్లు పెట్టిన నేపథ్యంలో మస్క్ ఆ వ్యాఖ్యలు చేశారు.
ఉక్రెయిన్ వార్‌లో పుతిన్ ఓడిపోరన్న అభిప్రాయాలను మస్క్ సమర్తించారు. ఉక్రెయిన్ గెలుస్తదని కల్పిత ప్రపంచంలో ఉండవద్దన్నారు. బిల్లుకు మద్దతు ఇవ్వడం అంటే.. ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని పొడిగించడమే అవుతుందన్నారు. యుద్ధాన్ని కొనసాగించాలన్న వత్తిడి పుతిన్‌పై ఉందని, ఒకవేళ ఆయన వెనక్కి తగ్గితే, అప్పుడు ఆయన్ను హతమారుస్తారని మస్క్ తెలిపారు. 95 బిలియన్ల డాలర్ల సాయాన్ని అందించేందుకు అమెరికా సేనేట్‌లో బిల్లు పెండింగ్‌లో ఉన్నది.
రెండు వైపులా మరణాలు ఆగాలని ఆశిస్తున్నట్లు మస్క్ చెప్పారు. ఒకవేళ రష్యాలో ప్రభుత్వం మారాలని భావిస్తే, అప్పుడు దానికి తగిన వ్యక్తిని ఎన్నుకోవాలని, కానీ ఆ వ్యక్తి పుతిన్ కన్నా కఠిన వ్యక్తే అయి ఉంటాడని ఆయన అన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

