Pat Cummins: మీ భార్యను ప్రేమిస్తున్నానని అభిమాని కామెంట్.. ప్యాట్ కమ్మిన్స్ ఇచ్చిన రిప్లై అదిరింది
Pat Cummins: ఓ అభిమానికి ఫన్నీ రిప్లై ఇచ్చాడు ప్యాట్ కమ్మిన్స్. ఆస్ట్రేలియా క్రికెటర్ తన ఎక్స్ అకౌంట్లో భార్యతో దిగిన ఫోటోను పోస్టు చేసి వాలెంటైన్స్ డే విషెస్ తెలిపారు. ఆ పోస్టుకు కామెంట్ చేస్తూ మీ భార్యను ప్రేమిస్తున్నానని ఓ అభిమాని తెలిపాడు. ఇక ప్యాట్ కమ్మిన్స్ ఇచ్చిన రిప్లై అందర్నీ థ్రిల్ చేస్తోంది.
సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెటర్ ప్యాట్ కమ్మిన్స్(Pat Cummins).. తన సోషల్ మీడియా అకౌంట్లో ఓ అభిమానికి ఇచ్చిన రిప్లై అందర్నీ నవ్విస్తున్నది. వాలెంటైన్స్ డే సందర్భంగా కమ్మిన్స్ తన భార్య బెక్కి గురించి ఓ పోస్టు చేశారు. సముద్రం వద్ద సర్ఫింగ్ చేస్తున్న ఫోటోను పోస్టు చేసిన అతను భార్య బెక్కికి వాలెంటైన్స్ డే విషెస్ చెప్పాడు. ఆ ఫోటోకు ఓ కామెంట్ కూడా జోడించాడు. సూపర్ మామ్, భార్య, నా వాలెంటైన్, సర్ఫర్ అంటూ ఆ పోస్టులో ప్యాట్ కమ్మిన్స్ తెలిపాడు. ఆమెకు హ్యాపీ వాలెంటైన్స్ డే చెబుతున్నట్లు వెల్లడించారు.
అయితే ఆ పోస్టు చేసిన కొద్ది సేపటికే ఆన్లైన్లో వైరల్ అయ్యింది. అతని అభిమానులు కామెంట్లతో హోరెత్తించారు. అయితే ఓ ఫ్యాన్ చేసిన కామెంట్ .. క్రికెటర్లో ఉన్న చమత్కారాన్ని బయటపెట్టింది. అతను సమయస్పూర్తితో ఇచ్చిన రిప్లై అందర్నీ ఆకట్టుకుంటున్నది. నేను భారతీయుడిని అని, నీ భార్యను ప్రేమిస్తున్నానని ఓ వ్యక్తి ఆ ఫోటోకు కామెంట్ చేశారు. ప్యాట్ కమ్మిన్స్ ఆ వ్యక్తికి రిప్లై ఇస్తూ.. ఈ విషయాన్ని తన భార్యకు చేరవేయనున్నట్లు చెప్పారు. ప్యాట్ కమ్మిన్స్ తన సమాధానంతో అభిమానికి ఇచ్చిన జలక్కు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు.
Pat Cummins. 🤣 pic.twitter.com/kiXGpYAzgv
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 14, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

