కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ తరపున ప్రచారంలో పాల్గొన్న సమాజ్వాదీ పార్టీ రాజ్యసభ ఎంపీ జయా బచ్చన్ తన అభిమాని పట్ల దురుసుగా వ్యవహరించారు. సెల్ఫీ తీసుకునేందుకు ముందుకొచ్చిన యువకుడిని ఆమె నెట్టివేశారు. జయా బచ్చన్ తీరుపై ట్విటర్ యూజర్లు మండిపడుతున్నారు.
దీదీకి మద్దతుగా తృణమూల్కాంగ్రెస్ తరపున ప్రచారం చేసేందుకు ఇటీవల కోల్కతాకు వచ్చిన జయా బచ్చన్ సెల్ఫీ తీసుకునేందుకు ఓ యువకుడు ముందుకు రాగా అతడిని ఆమె తోసివేసి ర్యాలీలో ముందుకు సాగిన వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది. గతంలోనూ జయా బచ్చన్ తన అనుమతి లేకుండా సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించిన అభిమానిపై మండిపడ్డారు.
Arrogant Jaya Bachchan
— Sandeep Panwar (@tweet_sandeep) April 8, 2021
Jaya Bachchan became angry when she saw a young man taking a selfie with her during a road show in Howrah pic.twitter.com/YEp9pToJUH