Adipurush Dialogues | ఆదిపురుష్ సినిమాలో హనుమంతుడి డైలాగులకు సవరణ.. ఏమని మార్చారంటే..! Video
Adipurush Dialogues | ఆదిపురుష్ మూవీ మేకర్స్ హనుమంతుడి డైలాగులకు సవరణలు చేశారు. మార్చిన డైలాగులతో ఉన్న వీడియో ట్విటర్లో చక్కెర్లు కొడుతున్నది.
ముంబై: ఆదిపురుష్ సినిమా విడుదలైనప్పటి నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ సినిమాలోని డైలాగుల విషయంలో, పాత్రలను మలిచిన తీరు విషయంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా హనుమంతుడి పాత్రతో చిల్లర మాటలు అనిపించడంపై జనం ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో ఆదిపురుష్ మూవీ మేకర్స్ హనుమంతుడి డైలాగులకు సవరణలు చేశారు. మార్చిన డైలాగులతో ఉన్న వీడియో ట్విటర్లో చక్కెర్లు కొడుతున్నది.
ఆదిపురుష్ సినిమా హిందీ వెర్షన్లో లంకా దహనం సందర్భంగా హనుమంతుడు ఇంద్రజిత్తుతో చెప్పే డైలాగులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ‘కప్డా తేరీ బాప్ కా, తేల్ తేరీ బాప్ కా, అగ్ బీ తేరీ బాప్ కా, జలేగీ బీ తేరి బాప్ హై’ (వస్త్రం నీ అయ్యదే, నూనె నీ అయ్యదే, నిప్పు నీ అయ్యదే, ఇప్పుడు తగులబడేది కూడా నీ అయ్యే) అని హనుమంతుడి చేత ఇంద్రజిత్తుకు చెప్పించడాన్ని పలువురు తప్పుపట్టారు.
దాంతో ఆ డైలాగులను ఇప్పుడు మార్చేశారు. ‘కప్డా తేరీ లంకా కా, తేల్ తేరీ లంకా కా, అగ్ బీ తేరీ లంకా కా, జలేగీ బీ తేరి లంకా హై’ (వస్త్రం నీ లంకదే, నూనె నీ లంకదే, నిప్పు నీ లంకదే, ఇప్పుడు తగులబడేది కూడా నీ లంకే) అని సవరించారు. ఈ సవరించిన డైలాగులతో ఉన్న ఓ వీడియో ఇప్పుడు ట్విటర్లో చక్కెర్లు కొడుతోంది. కింది వీడియోలో మీరు మార్చిన డైలాగులను వినవచ్చు.
Adipurush movie Dailoge Change pic.twitter.com/Gz0XWuHKme
— Đj Ķà Båđśháh Vìjàý (@jBhhVj1) June 20, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

