Jairam Ramesh | కార్పొరేట్స్ కంటే మధ్యతరగతిపైనే పన్ను భారం అధికం : జైరాం రమేష్
Jairam Ramesh : కంపెనీల కంటే వ్యక్తులే అధికంగా పన్ను చెల్లిస్తున్నారని ఇటీవల పన్ను వసూళ్ల గణాంకాల్లో వెల్లడైన విషయాన్ని ప్రస్తావిస్తూ మోదీ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ విమర్శలు గుప్పించారు.
Jairam Ramesh : కంపెనీల కంటే వ్యక్తులే అధికంగా పన్ను చెల్లిస్తున్నారని ఇటీవల పన్ను వసూళ్ల గణాంకాల్లో వెల్లడైన విషయాన్ని ప్రస్తావిస్తూ మోదీ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ విమర్శలు గుప్పించారు. కార్పొరేట్ పన్నులు తగ్గిస్తూ రూ. 2 లక్షల కోట్లను బిలియనీర్ల జేబుల్లో నింపిన మోదీ సర్కార్ మధ్యతరగతిపై మాత్రం పన్ను భారాలు మోపుతోందని మండిపడ్డారు.
2024 ఏప్రిల్ 1 నుంచి జులై 1 వరకూ ఆదాయ పన్ను వసూళ్లు రూ. 3.61 లక్షల కోట్లు కాగా, స్ధూల కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ. 2.65 లక్షల కోట్లుగా నమోదయ్యాయని జైరాం రమేష్ పేర్కొన్నారు. జులై 23న కేంద్ర బడ్జెట్ రానుండగా ఈ కీలక గణాంకాలు వెలువడ్డాయని చెప్పారు. ఈ డేటాను పరిశీలిస్తే కంపెనీల కంటే వ్యక్తులే అధికంగా పన్ను చెల్లిస్తున్న వైనం వెలుగుచూస్తోందని తెలిపారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో మొత్తం పన్ను వసూళ్లలో వ్యక్తిగత ఆదాయ పన్ను 21 శాతం ఉంటే, ఇప్పుడది 28 శాతానికి పెరిగిందని వివరించారు. కంపెనీలు చెల్లించే కార్పొరేట్ పన్ను వాటా 35 శాతం నుంచి 26 శాతానికి పడిపోయిందని పేర్కొన్నారు. 2019లో కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ పన్ను రేట్లను తగ్గించడం ద్వారానే పన్ను వసూళ్లు తగ్గాయని, కానీ ఆశించిన మేర ప్రైవేట్ పెట్టుబడులు మాత్రం పెరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ పన్ను రేట్లను తగ్గించినా యూపీఏ హయాంలో 35 శాతం ఉన్న ప్రైవేట్ పెట్టుబడులు ప్రస్తుతం 29 శాతానికి తగ్గాయని వెల్లడించారు.
Read More :
Joe Biden | అమెరికాలో రాజకీయ హింసకు చోటులేదు: జో బైడెన్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

