లక్నో: యూపీ(Uttar Pradesh)లో ఇవాళ ఎన్కౌంటర్ జరిగింది. గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్(Gangster Atik Ahmed) కుమారుడు అసద్ అహ్మద్‌ను ఎదురుకాల్పుల్లో(Encounter) పోలీసులు హతమార్చారు. అతని వద్ద నుంచి విదేశీ తయారీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఝాన్సీ వద్ద ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మరణించారు. అసద్ అహ్మాద్(Asad Ahmed), గులామ్‌లను పోలీసులు హతమార్చారు. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ఓ మర్డర్ కేసులో ఇద్దరూ మోస్ట్ వాంటెడ్ నిందితులు.
ఉమేశ్ పాల్ మర్డర్ కేసులో అసద్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులో అసద్‌పై 5 లక్షల రివార్డు కూడా ఉంది. యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇవాళ ఝాన్సీలో అతన్ని ఎన్కౌంటర్ చేశారు.సీటీఎఫ్ డిప్యూటీ ఎస్పీ నవేందు, డిప్యూటీ ఎస్పీ విమల్ నాయకత్వంలో ఆ ఎన్కౌంటర్ జరిగింది.
#WATCH | Former MP Atiq Ahmed's son Asad, aide killed in an encounter by UP STF in Jhansi
Visuals from the encounter site pic.twitter.com/kL3fUrr7S7
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 13, 2023
ఉమేశ్ మర్డర్ కేసులో అతిక్ అహ్మాద్‌ను ఇవాళ ప్రయాగ్‌రాజ్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.
#WATCH | Asad and Ghulam, the main shooters in the Umesh Pal murder, were tracked down and killed in an encounter today. We had information that they possessed sophisticated foreign-made weapons: Amitabh Yash, ADG UP STF pic.twitter.com/TYwjIdnrdt
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 13, 2023